FbTelugu

బెజవాడ టీడీపీ వర్గపోరుకు పుల్ స్టాఫ్: కేశినేని శ్వేత

అమరావతి: ఎంపీ కేశినేని నాని కుమార్తె, విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి కుమారి కేశినేని శ్వేత వర్గపోరుకు పుల్ స్టాఫ్ పెట్టారు. ఆమె స్వయంగా టీడీపీ నాయకులు బొండా ఉమామహేశ్వర్ రావు, బుద్ద వెంకన్న ల నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు.
ఇవాళ ఉదయం బొండా ఉమామహేశ్వర్ రావు, బుద్ద వెంకన్నలు ఎంపీ కేశినేని నాని పై విరుచుకుపడ్డారు. టీడీపీ ని కమ్మకుల సంఘం పార్టీగా మార్చుతున్నారని, ఒంటెద్దు పోకడలు పోతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ను ఏక వచనంతో పిలిచిన నాని ని చెప్పుతో కొట్టాలని అనుకున్నానని వెంకన్న అనడంతో ఒక్కసారిగా అంతర్గత పోరు హీటెక్కింది.

కుమారి కేశినేని శ్వేత ప్రచారానికి తాము వెళ్లడం లేదని ఇద్దరూ స్పష్టం చేయడంతో వివాదం రచ్చరచ్చ అయ్యింది.
పరిస్థితి చేయి దాటి పోతున్నదని గమనించిన కుమారి శ్వేత స్వయంగా రంగంలోకి దిగింది. ఆమె నేరుగా బొండా ఉమా మహేశ్వర్ రావు, బుద్ద వెంకన్న నివాసాలకు వెళ్లి చర్చించింది. విభేధాలు ఏమైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకుందామని వారికి నచ్చచెప్పింది. మీ సహకారం లేకుండా నేను ముందుకు వెళ్లలేనని కూడా స్పష్టం చేసింది. తండ్రి సమానులుగా గౌరవిస్తానని, ఆశీర్వదించాలని కోరింది. వివాదాలకు పుల్ స్టాఫ్ పెట్టి టీడీపీ అభ్యర్థుల గెలుపునకు పాటుపడాలని విన్నవించగా, వారు అంగీకరించారు. ఈ విషయాన్ని కుమారి శ్వేత అధికారికంగా ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.