FbTelugu

కామాంధుడికి టీటీడీ పదవి: నారా లోకేష్

అమరావతి: హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమలను ఎం చెయ్యాలనుకుంటున్నారు జగన్ రెడ్డి గారు? అని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు నారా లోకేష్ బాబు ప్రశ్నించారు.

తిరుమలలో డిక్లరేషన్ దగ్గర నుండి భక్తులపై లాఠీ ఛార్జ్ వరకూ అన్నీ భక్తుల మనోభావాలు దెబ్బతీసే నిర్ణయాలేనని లోకేష్ ట్వీట్ చేశారు. ఒక మహిళని మోసం చేసిన కామాంధుడికి టిటిడి పదవి కట్టబెట్టారా? అని నిలదీశారు. పెళ్లి చేసుకుంటానని ఒక మహిళ జీవితంతో ఆటలాడుకున్న కరణ్ రెడ్డికి టిటిడి హైదరాబాద్ సలహా మండలి వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించడం దారుణం అన్నారు. హిందూ ధార్మిక పరిరక్షణకు ఇంతకు మించి మంచి వ్యక్తి మీకు దొరకలేదా? అని ఎద్దేవా చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవడం ఇకనైనా ఆపండి అని అన్నారు. టిటిడి పై మీ ”దరువు” ఇకనైనా అపకపోతే ఆ తిరుమలేశుని ఆగ్రహానికి గురికాక తప్పదని నారా లోకేష్ హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.