FbTelugu

ఇళ్ల పట్టాల జాగలో టీడీపీ నేత హత్య

కడప: ప్రొద్దుటూరు లో టీడీపీ నేత నందం సుబ్బయ్యను దారుణ హత్య చేశారు. పేదలకు ఇళ్ళు పట్టాలు ఇచ్చే ఫ్లాట్ లలో గుర్తు తెలియని వ్యక్యులు నరికి చంపారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సుబ్బయ్య ప్రస్తుతం కడప జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి గా వ్యవహరిస్తున్నారు. ఘటన స్థలానికి ప్రొద్దుటూరు పోలీసులు చేరుకుని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై ఆరాతీశారు. వ్యక్తిగత కక్షలతో హత్య చేశారా, పార్టీ తగాదాలతో హత్య కు గురయ్యారా అనే దానిపై విచారణ ప్రారంభించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం వద్దకు కుటుంబ సభ్యులు చేరుకుని బోరున విలపిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.