FbTelugu

టీడీపీ నేత కరోనాతో మృతి

టీడీపీ నేత చలమలశెట్టి రామానుజయ కరోనాతో ఇవాళ మృతి చెందారు. రామానుజయ గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. లక్షణాలు ఎక్కువగా ఉండడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.

కాగా ఇవాళ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మృత్యువాత పడ్డారు. సీనీయర్ టీడీపీ నేత కరోనాతో మృత్యువాత పడడంతో టీడీపీ శ్రేణుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

You might also like