FbTelugu

ఏకగ్రీవాల కోసం వైసీపీ యత్నిస్తోంది: దేవినేని ఉమ‌

అమరావతి: ఏపీలో అతి త్వరలో పంచాయతి ఎన్నికలు జరగనున్న తరుణంలో వైసీపీ నేతలు ఏకగ్రీవాల కోసం యత్నిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏక‌గ్రీవాల కోసం ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతున్నారన్నారు.

తమ అభ్యర్థులు గెలిస్తే ఏయే కార్య‌క్ర‌మాలు చేస్తార‌న్న విష‌యాన్ని టీడీపీ అధినేత ప్ర‌క‌ట‌న చేస్తే సీఎం జ‌గ‌న్ ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని ప్ర‌శ్నించారు. పోటీ చేస్తోన్న అభ్య‌ర్థులు ఇటువంటి బెదిరింపుల‌కు లొంగిపోవద్దని, ధైర్యంగా నిల‌బ‌డాల‌ని తమ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.