FbTelugu

దారుణ హత్యకు గురైన టీడీపీ నేత

* గొంతు కోసి హత్య చేసిన దుండగులు
* వైసీపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే హత్య అంటూ ఆరోపణ
గుంటూరు: మరో టీడీపీ నేత దారుణ హత్యకు గురైన ఘటన జిల్లాలోని పల్నాడులో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టీడీపీ నేత పురంశెట్టి అంకులు(65)ను గుర్తుతెలియని దుండగులు అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు.

నిన్న సాయంత్రం ఓ ఫోన్ కాల్ రావడంతో దాచేపల్లికి కారులో వెళ్లారు. అక్కడే నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ పైకి వెళ్లి ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన డ్రైవర్ పైకి వెళ్లి చూడగా.. మొదటి అంతస్తులో హత్యకు గురైనట్టుగా గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న టీడీపీ శ్రేణులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి, పెదగార్లపాడు వైసీపీ నేతలు, పోలీసుల ప్రోద్బలంతోనే హత్య జరిగిందంటూ.. టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.