FbTelugu

వైసీపీ దగుల్బాజీ రాజకీయం: అయ్యన్న పాత్రుడు

అమరావతి: రాష్ట్రంలో వైసీపీ దగుల్బాజీ రాజకీయం చేస్తోందని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు దుయ్యబట్టారు.
ఎంపీ. వి.విజయసాయి రెడ్డికి మతిమరుపు రోగం వచ్చిందా అని అయ్యన్న ట్వీట్ చేశారు. పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లలకు భేషరతుగా మద్దతిచ్చి, ఆ విషయాన్ని మర్చిపోయారా అని నిలదీశారు. ఈ బిల్లును సమర్థించనివారిని దళారులు అంటూ విమర్శించింది మర్చిపోయావా అని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత రాజ్యసభలో అందరి చేత బూతులు తిట్టించుకుంది గుర్తు లేదా అన్నారు.

బేషరతుగా మద్దతు ఇచ్చి, ఇప్పుడు నాటకాలు ఆడతారా అని ఆయన ప్రశ్నించారు.ఎప్పుడైనా నీ ప్రసంగంలో “స్వామినాథన్ కమిటీ ” పేరు ఎత్తావా అని అయ్యన్న నిలదీశారు. కార్పొరేట్ ల ఆధిపత్యం గురించి, మద్దతు ధర గురించి, మార్కెట్ల పటిష్టత గురించి, కాంట్రాక్టు ఫార్మింగ్ వల్ల రైతులు ఎలా నష్టపోయేది, ఇలా అనేక అంశాల పై తెలుగుదేశం పార్టీ కీలక సూచనలు ఇచ్చిన సంగతి మర్చిపోయావా ? అని అయ్యన్నపాత్రుడు గుర్తు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.