FbTelugu

టిడిపి ఎన్నికల బహిష్కరణ?

అమరావతి: ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు బహిష్కరించాలని మెజారిటీ టిడిపి నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని పొలిట్‌బ్యూరో.. పార్టీ అధినేత ఎన్.చంద్రబాబు నాయడుకి వదిలేసింది.

ఇవాళ టిడిపి రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టిడిపి పొలిట్ బ్యూరో సమావేశమైంది. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌పై సమావేశంలో చర్చించారు. పరిషత్ ఎన్నికల బహిష్కరణపై పొలిట్ బ్యూరోలో చర్చించారు. పరిషత్ ఎన్నికలపై నేతలు తమ అభిప్రాయాలు చెప్పారు. ఎన్నికలు బహిష్కరించాలని, నామినేషన్ దాఖలు చేసిన వారు ఉపసంహరించుకుని వెనక్కి రావాలని నేతలు సూచించారు. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరినా రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోలేదన్నారు. పాత నోటిఫికేషన్ ప్రకారం షెడ్యూల్ విడుదల చేయటంతో తదుపరి కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.