FbTelugu

ఏపీలో లాక్ డౌన్ పెట్టాల్సిందే: టిడిపి డిమాండ్

అమరావతి: అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ ఎన్ 440కె వ్యాప్తిలో ఉన్నందున రాష్ట్రంలో లాక్ డౌన్ కు చర్యలు చేపట్టాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ముఖ్యనేతల సమావేశం జరిగింది.

చర్చల అనంతరం ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలో కొత్త కరోనా వేరియంట్ ఎన్ 440కె వేగంగా వ్యాపిస్తున్నది. ఇది ఇతర వైరస్ ల కన్నా 10 రెట్లు అధిక ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని హైదరాబాద్ సిసిఎంబి శాస్త్రవేత్తలు తొలిగా కర్నూలు జిల్లాలో కనుగొన్నారు. ఇప్పటికే ఏపీలో 30 శాతం వ్యాప్తి చెందింది. బెడ్ లు, వ్యాక్సినేషన్ కొరత, ఆక్సిజన్ కొరతతో ఇది విపత్తుగా మారుతోంది. ఇది మరింత తీవ్రస్థాయికి చేరడాన్ని అరికట్టాలంటే ఏపీలో లాక్ డౌన్ కు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. వైద్య సిబ్బంది కొరతను తీర్చడానికి నియామకాల కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. బెడ్లు-ఆక్సిజన్ సరఫరా పెంచాలని టీడీపీ డిమాండ్ చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.