FbTelugu

మంత్రులా… ఉన్మాదులా?: చంద్రబాబు

అమరావతి: వైసీపీ మంత్రులు, పార్టీ నేతలు ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు విమర్శించారు. గ్రామ పంచాయతీల్లో బలవంతపు, ఏకపక్ష ఏకగ్రీవాలను కచ్చితంగా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.
భయపెట్టి, బెదిరించి ఏకగ్రీవాలు చేస్తారా? అని చంద్రబాబు నాయుడు నిలదీశారు. గతంలో వైసీపీ చేసిన అరాచకాలను మీడియాకు రిలీజ్ చేశారు. 2014లో 2.67 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవం కాగా 2020లో ఏకంగా 23 శాతం ఏకగ్రీవం చేశారన్నారు. 2014లో 1.15 శాతం జెడ్పీటీసీలు ఏకగ్రీవం కాగా 2020లో ఏకంగా 19 శాతం ఏకగ్రీవం చేశారు. ప్రజలకు తాగునీటిని కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, ఏలూరు, దెందులూరు ఘటనలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలో టీవీ5 ప్రసారాలను ఎందుకు నిలిపివేశారు? అని ఆరోపించారు. గ్రామ స్వపరిపాలన ద్వారా అభివృద్ధి సాధ్యం అవుతుంది. రాష్ట్రంలో 120కిపైగా దేవాలయాలపై దాడులు చేస్తారా? నేను రామతీర్థం పోకపోతే వీళ్లు కంట్రోల్ అయ్యేవారా? అన్నారు. వీళ్ల కుట్రలను బయట పెట్టాను కాబట్టే కంట్రోల్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. మాచర్ల, తెనాలి లాంటి ఘటనలు జరిగితే ఇకపై చూస్తూ ఊరుకోమన్నారు. పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు.

ఏకగ్రీవాలపై సీఎం మంత్రులకు టార్గెట్లు పెడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, అరాచకాలే కన్పిస్తున్నాయి. వైసీపీ నేతలు ఎవరికీ దొరికింది వాళ్లు దోచుకుంటున్నారు. వైసీపీ సర్కారు దోచింది కొండంత.. ప్రజలకు చేసింది గోరంత అన్నారు. శ్రీకాకుళంలో డీఎస్పీ శివరామిరెడ్డి టీడీపీ నేతల్ని ఇబ్బంది పెడుతున్నారు. అచ్చెన్నాయుడికి 41-ఏ నోటీసులు ఎందుకిస్తారో తెలుసా?. నిన్ననే హైకోర్టుకు వెళ్లొచ్చిన విషయాన్ని డీజీపీ మర్చిపోయారా? పోలీసుల పరువు తీయాలనుకుంటున్నారా? ఉద్యోగ సంఘాలను కూడా రాజకీయాలకు వాడుకుంటారా? అని చంద్రబాబు నిలదీశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.