FbTelugu

అఖిలపక్ష భేటీ బహిష్కరించిన టిడిపి, బిజెపి

అమరావతి: రాష్ట్రంలో ఆగిన చోట నుంచే పరిషత్ ఎన్నికల ప్రక్రియ మొదలైందని, ఈ రోజు నుంచి అభ్యర్థులు ప్రచారం చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు.

ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఈసీ నీలం సాహ్ని సమావేశం కాగా టిడిపి, బిజెపి, జనసేన, సిపిఐ పార్టీలు బహిష్కరించాయి. హాజరైన వైసిపితో పాటు ఒకటి రెండు పార్టీలతో నీలం సాహ్ని సమావేశం నిర్వహించారు. వైసిపికి చెందిన లేళ్ల అప్పిరెడ్డి, కాంగ్రెస్​కు చెందిన మస్తాన్ వలి‌ హాజరయ్యారు. ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాన్ని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని టిడిపి, బిజెపి, జనసేన ప్రకటించాయి. గురువారం సాయంత్రం సమావేశ ఆహ్వానం పంపిన ఎస్‌ఈసీ.. రాత్రి ఎన్నికల తేదీలను ప్రకటించడం తెలిసిందే. పాత నోటిఫికేషన్‌ ప్రకారమే నిర్వహిస్తామని నిర్ణయించడం అప్రజాస్వామిక చర్యగా పేర్కొన్నాయి.

జనసేన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు రాకముందే ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్‌ తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశాక సమావేశం ఎందుకు? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. హఠాత్తుగా చేసిన నిర్ణయాన్ని నిరసిస్తూ ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.