FbTelugu

ఎంపీ మిమిని వెంటాడిన ట్యాక్సీ డ్రైవర్

కొలకత్తా: టీఎంసీ ఎంపీ, నటీమణి మిమి చక్రవర్తిని ఒక ట్యాక్సీ డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా వెంబడించంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
మిమి చక్రవర్తి ఉదయం జిమ్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది. తన కారును ఒక ట్యాక్సీ డ్రైవర్ వెంబడించడం ఆమె గమనించింది. కారు పక్కనే తన కారు ఆపి అసభ్యంగా ప్రవర్తించాడు. అయినా పట్టించుకోకుండా ముందుకు వెళ్లింది. మళ్లీ కారును ఓవర్ టేక్ చేసి అసభ్యకర భంగిమల్లో సైగలు చేయడంతో అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించింది.

ఎంపీ మిమి ఫిర్యాదు మేరకు డ్రైవర్ లక్ష్మణ్ యాదవ్ పై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై మిమి మాట్లాడుతూ, నేను ఇలాగే వదిలేస్తే రేపు కూడా మహిళలను వేధిస్తాడని తెలిపింది. ఇలాంటి వ్యక్తులను వదిలేయడం సురక్షితం కాదని పోలీసులకు ఫిర్యాదు చేసి, అప్పగించినట్లు ఎంపీ మిమి చక్రవర్తి తెలిపారు.

You might also like