FbTelugu

పన్నులు హిందువులకు.. జల్సాలు పాతబస్తీకా?

హైదరాబాద్: పన్నులన్నీ హిందువులు కడితే పాతబస్తీ వాసులు జల్సా చేస్తారా ? అంటూ.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకు పడ్డారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. పాతబస్తీలో హిందూ జనాభాను తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

పాతబస్తీలో హిందువులు భయానక వాతావరణంలో జీవిస్తున్నారన్నారు. పాతబస్తీని భాగ్యనగరంగా మార్చాలని బీజేపీ కోరుకుంటోందని అన్నారు. బీజేపీ గెలిస్తే రోహింగ్యాలు, పాక్ వాసులను తరిమికొడతామని అన్నారు. పాతబస్తీలో ఏడాదికి రూ.600 కోట్లు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.