FbTelugu

వలస కూలీలతో వెళుతున్న టాటాఏస్ బోల్తా

నల్లగొండ: వలస కూలీలతో వెళుతున్న ఓ టాటాఏస్ బోల్తా పడి 20 మందికి తీవ్రగాయాలైన ఘటన జిల్లాలోని నకిరేకల్ మండలం, ఇనుపాముల దగ్గర చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి వలస కూలీలతో  అద్దంకి వెళుతున్న ఓ టాటాఏస్ వాహనాన్ని ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలైనాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.