FbTelugu

టాటా కే పార్లమెంటు భవన్ కాంట్రాక్టు

ఢిల్లీ: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పార్లమెంటు భవన నిర్మాణ కాంట్రాక్టును ప్రముఖ కంపెనీ టాటా దక్కించుకున్నది. ఫైనాన్షియల్ బిడ్ లో ఈ టెండర్ ను చేజిక్కించుకున్నది.

బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ భవనం స్థానంలో మరో నూతన భవనం నిర్మించాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు రెండంతస్తుల భవనానికి టెండర్లు పిలిచారు. పార్లమెంటు భవన నిర్మాణానికి రూ.940 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వ ప్రజా పనుల విభాగం అంచనా వేసింది. ఈ పనులు దక్కించుకునేందుకు ఎల్ అండ్ టీ సంస్థ తో టాటా పోటీపడి రూ.861.90 కోట్లతో కాంట్రాక్టు చేజిక్కించుకున్నది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తరువాత పనులు ప్రారంభించనున్నారు. త్రిభుజాకారంలో నిర్మించే భవనంపై భారత జాతీయ చిహ్నం ముద్రించనున్నారు. 6వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవనం కొలువదీరనున్నది.

You might also like