FbTelugu

కెప్టెన్ మరణంతో బోరున ఏడ్చిన టాటా

ముంబై: తాజ్ మహల్ హోటల్ పై ఉగ్రదాడి జరిగి 12 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా ఇన్ స్టాగ్రామ్ లో ఉద్వేగంగా స్పందించారు. ఆ మారణ హోమం ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతున్నదని గుర్తు చేసుకున్నారు.
12 సంవత్సరాల క్రితం జరిగిన మారణహోమాన్ని ఎన్నటికీ మర్చిపోమని, ముంబై ప్రజలు అన్నీ పక్కనపెట్టి ఈ విధ్వంసకాండను అధిగమించడానికి ఒక చోట చేరడం చిరస్మరనీయమన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కోసం కన్నీరు పెట్టుకోగలం, శత్రువును జయించేందుకు ధైర్య సాహసాలతో పోరాడిన వారి త్యాగాలను మననం చేసుకోగలం అన్నారు. ఐక్యత, దయ, సున్నితత్వంతో కూడిన తీరును ఆదరించాలని, ఇది రాబోయే రోజుల్లో ప్రకాశిస్తునే ఉంటుందని ఇన్ స్టాగ్రామ్ లో టాటా వెల్లడించారు.

నవంబర్ 26 ఉగ్రదాడి తరువాత పునర్ నిర్మాణం చేయించి డిసెంబర్ 21న తాజ్ మహల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రతన్ టాటా అక్కడి సిబ్బందితో సమావేశమయ్యారు. ఆ దాడిలో 54 మంది ప్రాణాలను కాపాడి చివరికి నేలకొరిగిన కెప్టెన్ థామస్ జార్జీ గుర్తు చేసుకుంటూ టాటా బోరున విలపించారు. థామస్ కుటుంబానికి ఏమిచ్చి రుణం తీసుకోగలమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారు చివరన తీసుకున్న జీవితాన్ని వారి కుటుంబాలకు ప్రతి నెలా జీవితాంతం చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. హోటల్ మూతపడిన సమయంలో సిబ్బందికి జీతం ఇబ్బందులు రాకుండా మనీ ఆర్డర్ చేయించారు. మూడు రోజుల పాటు సిబ్బంది అంత్యక్రియలకు రతన్ టాటా హాజరుకావడాన్ని ఆయనకున్న మానవత్వం అని సిబ్బంది గుర్తు చేసుకుంటున్నారు.

https://www.instagram.com/p/CICgp2FHZRe/?utm_source=ig_web_copy_link

You might also like

Leave A Reply

Your email address will not be published.