FbTelugu

ప్రముఖ యాప్ లకు దీటుగా టాటా యాప్

ముంబై: కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచం ఆఫ్ లైన్ బదులు ఆన్ లైన్ లోకి మళ్లుతోంది. ప్రతి సంస్థ ఆన్ లైన్ కార్యకలాపాలకే మొగ్గు చూపుతోంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో భారీ పెట్టుబడితో సూపర్ యాప్ తయారు చేయాలని టాటా కంపెనీ నిర్ణయం తీసుకున్నది.

ఈ ఏడాది చివర్లో కాని వచ్చే ఏడాది ఆరంభంలో కాని ఆవిష్కరించనున్నారు. ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని యాప్ తో పాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ యాప్ లకు గట్టి పోటీ ఇవ్వనున్నారు. ఇప్పటికే టాటా డిజిటల్ పేరుతో ఒక యాప్ ను ఆవిష్కరించింది. ప్రపంచ ప్రఖ్యాతి టెన్సెంట్, అలీబాబా, అమెజాన్ తరహాలో సూపర్ యాప్ ను టాటా గ్రూపు తీసుకురానున్నది.

సుమారు రూ.1వేయి కోట్ల పెట్టుబడితో ఈ యాప్ ను అభివృద్ధ పరుస్తున్నామని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తెలిపారు. ఈ యాప్ లో అన్ని వస్తువులు, సరకులు లభ్యం కానున్నాయి. భవిష్యత్తు డిజిటల్ వ్యాపారం వేళ్లూనుకునే అవకాశం ఉండడంతో భారీ వ్యూహం, పెట్టుబడులతో టాటా రంగంలోకి దిగుతున్నది.

You might also like