FbTelugu

విదేశీ పెట్టుబడుల కోసం టాస్క్ ఫోర్స్

అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు అయ్యింది.

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎం. గౌతమ్ రెడ్డి నేతృత్వంలో 8 ఉన్నతాధికారులతో కూడిన కమిటీ పనిచేయనున్నది. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ముఖ్య కార్యదర్శులు ఎస్ ఎస్ రావత్, గోపాలకృష్ణ ద్వివేది, కార్యదర్శులు శ్రీకాంత్, కొనశశిధర్, పరిశ్రమ ల శాఖ డైరెక్టర్, ఈడీబి సీఈఓ సుబ్రహ్మణ్యం లను టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు గా నియమించారు.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చైనా దేశం నుంచి పలు విదేశీ కంపెనీలు ఇతర దేశాలకు తరలి వెళ్తున్నాయి. భద్రతా పరంగా, పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న దేశాలను ఆ సంస్థలు ఎంపిక చేసుకుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చైనా నుంచి భారత్ కు తరలి వచ్చేందుకు ప్రయత్నాలు చేసున్న వివిధ దేశాల పరిశ్రమలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా టాస్క్ ఫోర్స్ కమిటి పనిచేయనున్నది.

You might also like