FbTelugu

కేసీఆర్ పై సీబీఐ విచారణ చేయిస్తాం: తరుణ్ చుగ్

పెద్దపల్లి: సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై సీబీఐ విచారణ చేయాలని కేంద్రాన్ని కోరతామని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ తరుణ్ చుగ్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ పై ఆయన ఘాటు విమర్శలు చేశారు.
ఇవాళ పెద్దపల్లి జిల్లాకు చెందిన పలు పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ, తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతున్నదని ఆయన విమర్శించారు. తెలంగాణ ఇస్లామిక్ తీవ్రవాదులకు, రోహింగ్యాలకు అడ్డాగా మారిందన్నారు. నేరగాళ్లపై విచారణ చేయకుండా ప్రభుత్వం పోలీసు శాఖపై ఒత్తిడి పెంచుతున్నదని ఆయన ఆరోపించారు. నేరగాళ్లను కాపాడుతూ శిక్షలు పడకుండా చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. త్వరలోనే తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ నుంచి విముక్తి లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ రాజబాబు లా వ్యవహరిస్తున్నారని, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్నారు. దోపిడి దొంగలను బీజేపీ ఎప్పుడు వదిలిపెట్టదని తరుణ్ చుగ్ న్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.