FbTelugu

రాజకీయాల్లో లేకున్నా సేవచేస్తా: రజినీకాంత్

* అభిమానుల తీరు బాధను కలిగిస్తోంది
చెన్నై: తాను రాజకీయాల్లో ప్రవేశించకున్నా ప్రజలకు సేవచేస్తానని తమిళ స్టార్ సినీ హీరో రజినీ కాంత్ అన్నారు. గత కొంత కాలంగా తాను రాజకీయ పార్టీ పెడుతున్నట్టు పేర్కొని ఇటీవల తాను రాజకీయ పార్టీని పెట్టడం లేదని తేల్చిచెప్పడంతో తన అభిమానులు నిన్న చెన్నైలో ఆందోళన చేపట్టడం పట్ల ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు.

తన అభిమానుల తీరు బాధ కలిగించిందని అన్నారు. ఈ విషయంలో తాను ఓ నిర్ణయం తీసేసుకున్నానని అందరూ దాన్ని గౌరవించాలని కోరారు. రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి చేయవద్దని రజనీ కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.