FbTelugu

నార్త్ ఇండియన్స్ ఛీటర్స్: మంత్రి పికె.శేఖర్

చెన్నై: ఉత్తర భారతీయులు తమ రాష్ట్రంలో ఉంటూ, తమ పథకాలతో లబ్ధి పొందుతూ మొన్నటి ఎన్నికల్లో బిజెపికి ఓటు వేశారని తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి పికె.శేఖర్ బాబు విమర్శించారు.

ఇక్కడ ఉంటున్న ఉత్తరాదివాళ్లు బిజెపి కి ఓటు వేసి తమను మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాడు మంత్రి శేఖర్ బాబు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వారిపై తీవ్ర విమర్శలు చేశారు. డిఎంకె తో లాభపడిన మీరు బిజెపికి ఓటు వేశారని, ఆ విషయం మాకు కూడా తెలుసునన్నారు. ఎన్నికల తరువాత డిఎంకె కు ఓటు వేశామని మమ్మల్ని మోసగించారన్నారు. వారు మరింత సిగ్గు, శరంతో చచ్చిపోయేలా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల మూలంగా ఉత్తరాది ప్రజలను తమిళనాడు వాసులు చిన్నచూపు చూసే ప్రమాదముంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.