FbTelugu

తమిళనాడు నరహంతక ముఠా అరెస్టు

నెల్లూరు: తడ మండలంలోని బోడిలింగాలపాడు లో తలదాచుకొంటున్న నరహంతక ముఠా ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వెనక ఒక ఇంట్లోకి పోలీసులు వెళ్లి వారిని పట్టుకునేందుకు వెళ్లగా నాటు బాంబు పేలింది.
గంజాయి స్మగ్లర్ల కోసం తమిళనాడు పోలీసులు గాలింపు చేపట్టారు.

తమిళనాడు నుంచి వచ్చిన గంజాయి స్మగ్లర్లు ఇక్కడ ఉన్నారన్న పక్కా సమాచారంతో ఒక ఇంటిని చుట్టుముట్టారు. గాలింపు చర్యల్లో ముగ్గురు స్మగ్లర్లను పట్టుకోగా మరో ఐదు మంది పరారైనట్లు సమాచారం. గంజాయి స్మగ్లర్లు ఉన్న ఇంట్లో పోలీసులు వెతుకులాట ప్రారంభించగా నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఒక పోలీసు కానిస్టేబుల్ తో పాటు గ్రామానికి చెందిన మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. ఇంట్లో బాంబులు, వేట కొడవళ్ళ ను స్వాదీనం చేసుకున్నారు. పోలీసు అదుపులోకి తీసుకున్న నిందితులకు చెన్నైలోని పలు హత్య కేసులతో సంబంధాలు ఉన్నాయి. చెన్నైలో కిరాయి హత్యలు చేసి నెల్లూరు జిల్లా తడలో తల దాచుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు

You might also like

Leave A Reply

Your email address will not be published.