FbTelugu

క్షీణించిన విజయ్ కాంత్ ఆరోగ్యం

చెన్నై: తమిళ నాడు డిఎండికె పార్టీ అధ్యక్షుడు, తమిళ నటుడు విజయకాంత్ ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయనను ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు రామపురంలోని మియట్ ఆసుపత్రిలో చేరారు.

గతేడాది సెప్టెంబర్ నెలలో కరోనా పాజిటివ్ రావడంతో చెన్నైలోని మియట్ హాస్పిటల్ లో చేర్పించారు. కరోనా తగ్గిపోవడంతో ఆయనను హస్పిటల్ నుంచి డిశ్చార్జీ చేశారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆయన మియట్ హాస్పిటల్ లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకుంటారు. గత మూడు సంవత్సరాలుగా విజయ్ కాంత్ ఆరోగ్యం సరిగా ఉండడం లేదు. దీంతో ఆయన సినిమాలలో కూడా నటించడం లేదు. ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ ఆయన విజయం సాధించలేకపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.