FbTelugu

సినీ కార్మికులకు తమన్నా విరాళం

హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ కారణంతో విధించిన లాక్ డౌన్ కారణంగా.. ప్రతిఒక్క కార్మికుడు, వలస కూలీలు, సగటు మధ్యతరగతి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ తరుణంలో ప్రముఖ సినీ నటి తమన్నా తన వంతు సాయంగా సినీ కార్మికుల సంక్షేమానికి మూడు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ విరాళాన్ని కరోనా క్రైసిన్ చారిటీకి అందజేశారు. ఇప్పటికే అనేక సినీ నటులు భారీ స్థాయిలోనే విరాళాలు అందజేసిన విషయం తెలిసిందే.. అస్సలు చేయకపోవడం కన్నా ఎంతో కొంత చేయాలన్న ఆలోచనే గొప్పదిగా చెప్పవచ్చు. ఈ తరుణంలోనే చాలా మంది చిరు ఉద్యోగులు కూడా విరాళాలు ఇస్తున్నారు.

You might also like