FbTelugu

సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న తమన్

ఎస్.ఎస్.తమన్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. వరుస సినిమాలతో దూసుకువెళ్తూ సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీని దుమ్ము దులిపేస్తున్నాడు.
చిన్న హీరోలు, పెద్ద స్టార్ లు అనే తేడా లేకుండా ఆయన అందరికీ మ్యుజిక్ అందిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదలు సందీప్ కిషన్ వరకు అందరికీ తమన్ ఒక్కడే కన్పిస్తున్నాడు.

ఈయన వాయింపు చూసి అభిమానులు సైతం అవాక్కవుతున్నారు. ఒకటి కాదు రెండు ఏకంగా పది సినిమాల బుకింగ్ 2021లో తమన్ అడుగుపెడుతున్నాడు. ఇవే కాకుండా మరో ఐదు సినిమాలకు ఓకే చెప్పే పనిలో ఉన్నారు. వచ్చే సంవత్సరం చూసే సినిమా పోస్టర్లలో చాలా వరకు తమన్ పేరు ఉంటుందనలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఏడాది అల వైకుంఠపురము మొదలు డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ లాంటి సినిమాలు ఇచ్చాడు. ఆయన చేతిలో ఉన్న సినిమాలు ఇవే. క్రాక్, సర్కారు వారి పాట, అయ్యపునుమున్ కోషియమ్, వకీల్ సాబ్, బోయపాటి శ్రీను, వరుణ్ తేజ్, యువరత్న, ఈశ్వరన్, కేదువ సినిమాలకు తమన్ సంగీతం అందించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.