FbTelugu

ఆర్టీసీ పై కేసీఆర్ తో మాట్లాడతాను: పవన్

Talk-to-KCR-on-RTC-says-Pawan

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల విషయంలో నా ప్రయత్నం చేస్తాను. కేసీఆర్ అపాయింట్ మెంట్ అడుగుతాను. కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వకుంటే అప్పుడు ఆలోచిస్తాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పై చర్చలు చేయాలని అడుగుతాను. కేసీఆర్ ఎందుకు కోపంగా ఉన్నారో తేలియడం లేదు. సమాజంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంటుంది. కేసీఆర్ 48వేల మంది కార్మికులను దృష్టిలో పెట్టుకోవాలి. పరిష్కారం చూపాలని కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తాను. వ్యక్తిగతంగా నా ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వానికి పట్టు విడుపులు ఉండాలి. మంత్రులు కేటీఆర్ ను, హరీశ్ రావు ను కలుస్తాను. కేశవరావుతో ఫోన్ లో మాట్లాడుతాను. భవిష్యత్తులో కార్మికుల నిర్ణయాలకు నేను మద్దతు ఇస్తాను. ప్రత్యేక రాష్ట్రం వచ్చినంక ఇలాంటి పరిస్థితులు రావడం దురదృష్టకరం. మిలియన్ మార్చ్ కు జేఏసీ నాయకులు మద్దతు అడిగారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆర్టీసీ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనేలా లేదా అనేదీ అప్పుడు ఆలోచిస్తానన్నారు.

జనసేన మొదటినుండి సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వం తో మాట్లాడుతాను అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారని అన్నారు. ఏపీలో ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని మంత్రి పేర్ని నాని కూడా మరోసారి స్పష్టం చేశారని అన్నారు.

You might also like