FbTelugu

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల విజృంభణ

కాబూల్: కొద్ది రోజుల నుంచి ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబన్లు విజృంభిస్తున్నారు. ఇప్పటి వరకు కొంత భయం భయంగా గడిపిన వీరు జిల్లాలను స్వాధీనం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మూడు జిల్లాలను తమ ఆదీనంలోకి తెచ్చుకున్నారు.

పరిస్థితులు అదుపులోకి వచ్చాయని తేలడంతో గతేడాది సెప్టెంబర్ నెలలో అమెరికా, నాటో దళాలు దేశం నుంచి వెళ్లిపోయాయి. దళాలు వెళ్లిపోవడంతో ఇక తమకు రక్షణ లేదని ప్రజలు భావించారు. ఆ విధంగానే తాలిబన్లు రెచ్చిపోతున్నారు. తాలిబన్ ఉగ్రవాదులు వరదక్ ప్రావిన్స్ లో జల్రేజ్ జిల్లాను, లాగ్మాన్ ప్రావిన్స్ లో దౌలత్ షా జిల్లాను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. మే నెల ప్రారంభంలో బాగలాన్ ప్రావిన్స్ లో బుర్కా జిల్లాను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ భద్రతా బలగాలు ముందుకు సాగకుంగా నిరోధించేందుకు మిలిటెంట్ పౌరులను తాలిబన్లు ప్రయోగిస్తున్నారని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రోహుల్లా అహ్మద్ జాయ్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.