FbTelugu

వెంటనే సహాయక చర్యలు చేపట్టండి: కిషన్ రెడ్డి

హైదరాబాద్: శ్రీశైలం పవర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై బీజేపీ కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో మాట్లాడిన ఆయన వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శ్రీశైలం పవర్ హౌస్ లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 9 మంది సిబ్బంది సొరంగంలోనే చిక్కుకున్న విషయం తెలిసిందే.

You might also like