FbTelugu

చేతనైతే నామీద యాక్షన్ తీసుకోండి: ప్రసన్నకుమార్

నెల్లూరు : జిల్లాలోని బుచ్చిరెడ్డి పాలెంలో కరోనా సాయం అందజేతలో పాల్గొన్న అధికారులకు నోటీసులు జారీ చేయడం పట్ల ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్ నుంచి వచ్చిన ఎస్పీ ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

అనవసరంగా అధికారుల జోలికి వస్తే సహించనని అన్నారు. చేతనైతే తనమీద చర్యలు తీసుకోండని అన్నారు. ఈ విషయంపై కలెక్టర్ కూడా వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.

You might also like