FbTelugu

ఆ ఆస్పత్రులపై చర్యలు తీసుకోండి: హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణలోని ప్రైవేటు ఆస్పత్రులలో కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం పట్ల ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా ప్రైవేటు ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేయడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అపోలో, బసవతారం ఆస్పత్రుల్లో ప్రభుత్వ నిబందనలు ఉల్లఘించారంటూ హైకోర్టులో పిల్( ప్రజాప్రయోజన వ్యాజ్యం) దాఖలైంది. అధిక ఫీజులను ఇవ్వక పోతే మృతదేహాలను కూడా ఇవ్వడం లేదని పిల్ లో పేర్కొన్నారు. దీంతో ఈ విషయాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, అలాగే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

You might also like