FbTelugu

తైవాన్ లో రైలు ప్రమాదం.. 36 మంది మృతి

బీజింగ్‌: టోరోకో జార్జ్‌ ప్రాంతంలో రైలు పట్టాలు తప్పడంతో 36 మంది ప్రయాణీకులు చనిపోగా డజన్ల కొద్ది ప్రయాణీకులు గాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో రైలులో 350 మంది ప్రయాణిస్తున్నారు.

శుక్రవారం ఉదయం ఉత్తర హూలిన్ ప్రాంతం నుంచి టైటుంగ్ వెళ్తుండగా మార్గ మధ్యంలో టన్నెల్ దాటుతుండగా గోడలను బోగీలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ట్రాక్స్ నుంచి రెండు మూడు బోగీలు ఎగిరిపడడం మూలంగా టన్నెల్ గోడకు గుద్దుకుని ప్రమాదం సంభవించిందని మరో వాదన కూడా విన్పిస్తున్నది. మూడు బోగీల నుంచి 60 మంది ప్రయాణీకులను బయటకు తీసుకువచ్చినట్లు తైవాన్ అఫిషియల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఘటన విషయం తెలిసిన తరువాత ట్రాన్స్ పోర్టు అండ్ కమ్యూనికేషన్ మినిస్టర్ లిన్ చియా లంగ్ సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు బయలుదేరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.