FbTelugu

సబ్‌ రిజిస్ర్టార్లుగా తహసీల్దార్లు

అమరావతి: రాష్ట్రంలోని మండల తహసీల్దార్లకు జాయింట్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ హోదా కల్పిస్తూ ఏపీ రెవెన్యూ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ అధికారం కల్పించారు. లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను వెంటనే రిజిస్ర్టేషన్‌ చేసేందుకు రిజిస్ర్టేషన్‌ చట్టం ప్రకారం ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు పేర్కొంది. వచ్చే నెలలో ఉగాది రోజున పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాల రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు తహసీల్దారు కార్యాలయాలను జాయింట్‌ సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలుగా పరిగణించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More