FbTelugu

రూ.1 కోటి తీసుకుని తహశీల్దార్ మోసం

అమరావతి: ఏపీ సచివాలయం వద్ద నెల్లూరు జిల్లాకు కు చెందిన దంపతుల ఆత్మహత్యా యత్నం చేశారు. ఇద్దరు పిల్లలతో పెట్రోల్ డబ్బాతో వచ్చిన దంపతులు ఆత్మహత్యకు పాల్పడే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు.

నెల్లూరు జిల్లా దుత్తలూరు తహశీల్దార్ చంద్రశేఖర్ తమ దగ్గర రూ.1 కోటి పైన తీసుకుని మోసం చేశారని దంపతులు ఆరోపించారు. పొలం వివరాలు ఆన్ లైన్ నమోదు చేయిస్తానని డబ్బులు తీసుకుని, పని చేయలేదన్నారు. ఆయన చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగాయి కాని పని కాలేదని దంపతులు వాపోయారు. అటు అప్పులు తీర్చలేక, ఇటు పనులు చేయించలేక సతమతమవుతూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు. ఆత్మహత్యా యత్నం సమాచారం తెలుసుకున్న పోలీసులు సచివాలయానికి దంపతులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తామని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.