FbTelugu

‘ఆ పేకాటతో నాకు సంబంధం లేదు’: ఎమ్మెల్యే శ్రీదేవి

గుంటూరు: ఎమ్మెల్యే పేకాట ఆడిస్తున్నారంటూ వస్తున్న కథనాలపై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆ పేకాటలకు తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తనపై వస్తున్న తప్పుడు కథనాలపై నిజాలు చెప్పేందుకే మీడియా ముందుకు వచ్చానంటూ తెలిపారు. పేకాట నిర్వహణ జరిగింది నంబూరు గ్రామంలోనని.. తాడికొండ నియోజకవర్గంలో కాదని అన్నారు.

పేకాట సిబిరం ఏర్పాటుపై పోలీసులు పూర్తి విచారణ చేయాలన్నారు. మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. తాను పేకాట రాయుళ్లను వదిలేయమని ఏ పోలీసులకూ చెప్పలేదన్నారు. దీనిపై డిజిపికి ఫిర్యాదు చేస్తాన్నారు. తప్పుడు కథనాలు రాస్తే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

You might also like