పాట్నా: దేశవ్యాప్తంగా కరోనా వ్యాపించడానికి కారణమైన నిజాముద్దీన్ మర్కజ్ మసీదు సభ్యులను ఉగ్రవాదుల్లా చూడాలని ముజఫర్‌పూర్ బీజేపీ ఎంపీ అజయ్ నిషాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బిహార్ ముజఫర్‌పూర్‌లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. దేశంలో నేడు ఈ దుస్థితికి తబ్లిగీ జమాత్ సభ్యులే కారణమని, కాబట్టి వీరిని ఉగ్రవాదుల్లా భావించాలని ఆయన అన్నారు. మదర్సాలలో నేర్పేది ఏమీ లేదని, పంక్చర్లకు మరమ్మతులు ఎలా చేయాలో మాత్రమే అక్కడ నేర్పిస్తారని ఎద్దేవా చేశారు. ఇలాంటి శిక్షణ మూలంగానే వీరు మహమ్మారి వైరస్‌ను మరింత ప్రమాదకరంగా మార్చారని అజయ్ విరుచుకుపడ్డారు.