FbTelugu

టి సెట్ పరీక్షల తేదీలు ఇవే

హైదరాబాద్: తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్టులు ఆగస్టు నెలలో నిర్వహించనున్నట్లు విద్యా శాఖ మంత్రి పి.సబితా రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆమె పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు.

ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎంసెట్, 4,5,6 తేదీలలో ఎంసెట్ ఇంజనీరింగ్, 9, 10 తేదీల్లో ఎంసెట్ ఎఎం, 3న ఈసెట్, 11 నుంచి 14 వరకు పిజి సెట్, 19, 20 తేదీల్లో ఐసెట్, 23న లాసెట్, 24, 25 తేదీల్లో ఎడ్ సెట్, 17న పాలిసెట్ నిర్వహించనున్నారు. కరోనా మార్గదర్శకాలను అనుసరించి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. ఇంజనీరింగ్, పిజి, డిగ్రీ, డిప్లొమా చివరి సంవత్సరం పరీక్షలు జూలై మొదటి వారంలో ప్రారంభించి నెలాఖరు కల్లా పూర్తి చేయాలని యూనివర్సిటీ విసిలను కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.