FbTelugu

సహజీవనం… అత్యాచారం…

తిరువనంతపురం: నమ్మివచ్చిన మహిళ ను ఒక వ్యక్తి మాటలను నమ్మి సహజీవనం చేసింది. ఇద్దరూ కలిసి ఒకే ఫ్లాట్ లో నివసించారు. కొద్ది రోజులకే అతని నిజస్వరూపం బయటపడడంతో చెరనుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదుచేసింది.

ఒక మహిళకు మార్టిన్ పెలికోట్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మాటా, మనసులు కలవడంతో ఇద్దరూ కలిసి ఒకే అపార్ట్ మెంటు లో ఫ్లాట్ అద్దె కు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. కొద్ది రోజుల తరువాత తన లైంగిక వాంఛలు తీర్చాలంటూ బలవంత పెట్టడం, భౌతిక దాడి కి దిగడంతో మహిళ భీతిల్లిపోయింది. సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలను చూపించి ఆమె వద్ద ఉన్న రూ.5 లక్షలు కూడా గుంజేసుకున్నాడు. ఈ విషయాలు ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ పలుమార్లు అత్యాచారం చేశాడు. అతని లైంగిక వేధింపులు భరించలేక గత మార్చిలో పారిపోయి మరో చోట ఆశ్రయం పొందింది. తనకు జరిగిన అన్యాయంపై ఆ మహిళ ఎర్నాకుళం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంత విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు మార్టిన్ కోసం వెదుకులాడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.