FbTelugu

సిడ్నీ టూ సిడ్నీ… సూపర్ సేల్!

సిడ్నీ: ఆ విమానం ఏ ఏయిర్ పోర్టు నుంచి బయలుదేరి వెళ్తుందో తిరిగి అదే ఏయిర్ పోర్టుకు చేరుకుంటుంది. ఈ విమానం టిక్కెట్లను సేల్ కు పెట్టగా కేవలం పది నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి.

ఆస్ట్రేలియా దేశానికి చెందిన క్వాంటాస్ ఏయిర్ లైన్స్ కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. విమాన ప్రయాణం చేయాలనే ఉత్సాహం, సరదా ఉన్నవారి కోసం ప్రత్యేక విమానం ప్లాన్ చేసింది. సెవెన్ అవర్ సీనిక్ ఫ్లైట్ టు నోవేర్ పేరిట ఖరారు చేశారు. ఈ విమానం ఏ ఏయిర్ పోర్టులో దిగదు, గమ్యస్థానం అంటూ ఏమీ లేదు కూడా.
ఆ దేశంలో ప్రధాన ప్రాంతాలైన ఉలూరు, కటా టాటా, గోల్డ్ కోస్ట్, విట్సుండేస్, బైరాన్ బే, సిడ్నీ హార్బర్ మీదుగా ఏడు గంటల పాటు ప్రయాణించిన తరువాత ఎక్కడి నుంచి బయలు దేరిందే మళ్లీ అక్కడికే వెళ్లి ల్యాండ్ అవుతుంది. ఈ స్పెషల్ ఫ్లైట్ అక్టోబర్ 10వ తేదీ సిడ్నీ ఏయిర్ పోర్టు నుంచి బయలుదేరి ఏడు గంటల తరువాత ఇదే ఏయిర్ పోర్టుకు చేరుకుంటుంది.

ఈ ఫ్లైట్ లోని 134 టిక్కెట్లను విక్రయానికి పెట్టగా కేవలం 10 నిమిషాల్లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ టిక్కెట్ల ధర ను రూ.42,244 నుంచి రూ.2,03,280 మధ్య బిజినెస్, ప్రిమియం, ఎకానమీ క్లాసులుగా నిర్ణయించి విక్రయించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.