FbTelugu

అడ్డుగా ఉందని ప్రియుని భార్యపై కత్తితో దాడి

Sword-attack-on-boyfriends-wife

అనంతపురం: ఓ యువతి తను ప్రేమించిన వ్యక్తి భార్య తనకు అడ్డుగా ఉందని కత్తితో హత్యాయత్నం చేసిన ఘటన జిల్లాలోని మహాత్మాగాంధీ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పట్టణంలోని మహాత్మాగాంధీ కాలనీకి చెందిన శ్రీనివాసులును అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించింది. కానీ చెప్పలేదు. అయితే ఈ మధ్య శ్రీనివాసులు, మహేశ్వరి (19) అనే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.

దీంతో తన ప్రేమకు అడ్డుగా ఉన్న మహేశ్వరిని చంపాలనుకుంది. మహేశ్వరి ఒంటరిగా ఉన్న సమయంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడిచేసి పారిపోయింది. బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయమేమీ లేదని చెప్పినట్టు తెలిపారు.

You might also like