FbTelugu

స్వీటు ఇచ్చాడు… ఆఫీసుకే తాళం వేయించాడు

నిర్మల్: తన కింద పనిచేసే ఉద్యోగి అందించిన స్వీటును మహానందంగా స్వీకరించిన తహశీల్దార్ ఆ తరువాత కరోనా క్వారంటైన్ కేంద్రానికి వెళ్లాడు.

తహశీల్దార్ తో పాటు స్వీటు తిన్న సిబ్బంది కూడా క్వారంటైన్ కు పరుగులుపెట్టారు. నర్సాపూర్ మండల కార్యాలయం పరిధిలోని చాటుపల్లి గ్రామానికి వీఆర్ఏ ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదుకు వెళ్ళొచ్చాడు. అక్కడినుండి తెచ్చిన స్వీట్లను తహశీల్దార్ సహా అందరికి తినిపించాడు

మర్కజ్ మసీదుకు వెళ్లొచ్చిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశం మేరకు వీఆర్ఏ కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. ఈ విషయం తెలిసిన నర్సాపూర్ మండల తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది గాగరాపడ్డారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా  అందరు క్వారంటైన్ కి వెళ్లిపోయార. దీంతో తహశీల్దార్ కార్యాలయానికి తాళం వేశారు.

You might also like