FbTelugu

తండ్రి కోసం ఆసుపత్రిలో స్వీపర్ ఉద్యోగం

విశాఖపట్నం: కరోనా బారినపడిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రిని దగ్గరుండి చూసుకునేందుకు స్వీపర్‌గా చేరిన ఎంబీఏ పట్టభద్రుడి వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని గుట్టు రట్టు చేశాడు.
విశాఖలోని అక్కయ్యపాలేనికి చెందిన ఆరేపల్లి సుదర్శనరావు(65)కు కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో మే నెల 2న కెజిహెచ్‌లోని చేర్పించారు. చికిత్సతో ఆయన కొద్దిగా కోలుకోవడంతో వారం రోజుల తరువాత కుటుంబ సభ్యులకు వీడియో కాల్‌ చేసి మాట్లాడారు. తాను కోలుకున్నానని, నాలుగైదు రోజుల్లో ఇంటికి పంపిస్తామని వైద్యులు చెప్పారని తెలిపాడు. ఆ తర్వాత ఆయన అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.

ఈ విషయం తెలిసిన చిన్న కుమారుడు మధుకృష్ణ లోపలకు వెళ్లి చూడగా తండ్రి ఆరోగ్యంగానే కనిపించాడు. అయినా కొద్దిరోజులు దగ్గరుండి చూసుకోవాలనుకుని నిర్ణయించాడు. ఎంబీఏ చదివి, ఒక కాల్‌సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్నప్పటికీ సెలవు పెట్టాడు. సోమవారం కెజిహెచ్‌ శానిటేషన్‌ విభాగంలో స్వీపర్‌గా చేరాడు. మంగళవారం ఉదయం 8గంటల సమయంలో సుదర్శన రావు బాత్‌రూమ్‌కు వెళ్లి జారిపడ్డాడు. తీవ్రగాయమై రక్తస్రావం కావడం, ఎవరూ గమనించకపోవడంతో సరైన సమయంలో వైద్యం అందక చనిపోయాడు. ఉదయం 10గంటలకు వెళ్లిన మధుకృష్ణకు తండ్రి మరుగుదొడ్డి వద్ద పడిపోయి, చనిపోయి కనిపించాడు. సకాలంలో చికిత్స అందించి ఉంటే మృతిచెంది ఆయన ఉండేవాడు కాదని కుమారుడు ఆరోపించాడు. తన తండ్రి మృతికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి యాజమాన్యానికి కుమారుడు మధుకృష్ణ ఫిర్యాదు చేశాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.