FbTelugu

స్వీడన్ కే మచ్చతెచ్చిన నేత

స్టాక్ హోమ్: స్వీడన్ దేశ చరిత్రలో తొలిసారి ప్రధాని స్టిఫెన్ లోఫ్ వెన్ పదవి నుంచి బలవంతంగా వెదొలిగారు. దేశ పరువును మంటగలిపారని పౌరులు బహిరంగంగా విమర్శిస్తున్నారు.
స్టిఫెన్ కు వ్యతిరేకంగా గతవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో పదవి నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో వైదొలిగారు.

ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమై పదవి పోగొట్టుకున్న తొలి ప్రధాని గా ఆయన అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. మరో వ్యక్తి పేరును ప్రధానిగా ఎంపిక చేయడమా లేదా ఎన్నికలకు వెళ్లడమా అనేదానిపై పార్లమెంటు స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. దేశంలో నూతనంగా నిర్మించిన అపార్ట్ మెంట్లకు అద్దె నియంత్రణ ప్రణాళిక విషయంలో ప్రభుత్వానికి, మద్దతిచ్చిన లెఫ్ట్ పార్టీకి మద్య విభేదాలు ఉన్నాయి. తమ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉండడంతో లెఫ్ట్ మద్దతు ఉపసంహరించుకోవడంతో స్టిఫెన్ సర్కార్ మైనారిటీలో పడింది. ఇదే అదనుగా భావించిన నేషనలిస్ట్ స్వీడన్ డెమోక్రాట్ లు పార్లమెంటులో ప్రధాని స్టిఫెన్ పై అవిశ్వాసం పెట్టి నెగ్గారు. మొత్తం 349 మంది సభ్యులు ఉన్న సభలో అవిశ్వానికి మద్దతుగా 181 మంది ఓటేశారు. అవిశ్వాసం నెగ్గడంతో ప్రధాని పదవి నుంచి దిగిపోక తప్పలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.