FbTelugu

ఇద్దరు మంత్రుల ప్రమాణ స్వీకారం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో ఈ రోజు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన మంత్రులతో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రమాణం చేయించారు.
నూతన మంత్రులుగా ఎమ్మెల్యేలు చెల్లుబోయిన వేణుగోపాల్, డా. సిదిరి అప్పలరాజు ప్రమాణం చేశారు. రాజ భవన్ లో మధ్యాహ్నం 1.29కి సాదాసీదాగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన, నాని, బాలినేని శ్రీనివాస్ హాజరయ్యారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన చెందిన డా.అప్పలరాజు 2019 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

మత్స్యకార కులానికి చెందిన మోపిదేవి వెంకటరమణ స్థానంలో అదే కులానికి చెందిన అప్పలరాజును ఎంపిక చేశారు. శెట్టిబలిజ కులానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో అదే కులానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాల్ ను మంత్రిగా ప్రమాణం చేయించారు.

AP Raj Bhavan

You might also like