FbTelugu

రాజ్యసభకు కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ: రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్ పర్సన్ వెంకయ్య నాయుడు మొత్తం 45 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం ఎన్నికైన మొత్తం సభ్యులలో తొలిసారి ఎన్నికైన వారు 36 మంది ఉన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సభానియమాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఏపీ నుంచి మోపిదేవి, పిల్లి సుభాష్, అయోధ్య రామిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సమావేశాలు జరగక పోయినప్పటికీ ప్రమాణ స్వీకారోత్సవం జరగడం ఇదే మొదటి సారి.

You might also like