గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ల రేవతి టోల్గేట్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి చేయిచేసుకుని నానా హంగామా చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని కాజా టోల్ గేట్ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే..
రాష్ట్ర వడ్డెర కార్మొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ల రేవతిని టోల్ ఫీజు చెల్లించాలంటూ సిబ్బంది అనడంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన రేవతి నన్నే టోల్ చెల్లించాలంటారా అంటూ.. సిబ్బందిని దూషిస్తూ.. కారుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను ఆమె స్వయంగా దిగి తొలగించారు. అడ్డగించబోయిన సిబ్బందిపై చేయి కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం విజయవాడ వైపు వెళ్లారు. ఈ ఘటనపై సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం.