FbTelugu

అనుమానాస్పదంగా.. వలస కుటుంబం ఆత్మహత్య

అనుమానాస్పదంగా ఓ వలస కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాకు చెందిన నిషా, మక్సూద్ భార్యాభర్తలు. వీరు గత 25 సంవత్సరాలుగా తమ ఇద్దరు కుమారులతో పాటూ భర్తతో విడాకులు తీసుకున్న కుమార్తెతో కలిసి వరంగల్ అర్బన్ జిల్లాలోని కరీమాబాద్‌లో బార్‌దాన్ కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో లక్ డౌన్ కారణంగా.. పారిశ్రామికవాడలోని ఓ భవనంలోనే ఉంటున్నారు.

వీరితో పాటూ అదే భవనంలో బీహార్ కు చెందిన కొందరు యువకులు కూడా ఉంటున్నారు. ఈనేపథ్యంలో మక్సూద్, నిషా, వారి 22 ఏళ్ల కుమార్తె, మూడేళ్ల మనవడు బావిలో శవాలుగా తేలారు. ఈ విషయాన్ని ట్రేడర్స్ యజమాని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే మక్సూద్ ఇద్దరు కుమారులు, బీహార్ యువకులు కనిపించకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

You might also like