FbTelugu

అనుమానాస్పదంగా ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

* కాలేజీకి వెళ్లిన విద్యార్థి శవంగా ప్రత్యక్షం
* నేడు కాలేజీపై దాడికి దిగిన గ్రామస్తులు
శ్రీకాకులం: కాలేజీకి వెళ్లిన విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెంది ప్రత్యక్షమైన ఘటన జిల్లాలోని రణస్థలం మండలం, సీతంపేట గ్రామ శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఈ నెల 21న మొవ్వ నగేష్ అనే విద్యార్థి స్థానిక శివాణి ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు.

ఈ నెల 25న యూనిఫాం కోసం సొంత ఊరికి వచ్చి మళ్లీ కాలేజీకి వెళ్లాడు. కానీ కాలేజీలో లేడు సీతంపేట గ్రామ శివారులో ఎవరూ గుర్తు పట్టలేని స్థితిలో మృతి చెంది ఉన్నాడు. ఎవరైనా దారుణంగా హత్య చేశారా ? లేదా అతడే సూసైడ్ చేసుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా నువ్వులరేవు గ్రామస్తులు సుమారు 600 మంది శివాణి ఇంజనీరింగ్ కాలేజీపై దాడికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థి మొవ్వ నగేష్ మృతి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.