FbTelugu

సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి

బెంగుళూరు: సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. శరణ్య(25) అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని రోహిత్ అనే యువకున్ని ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకుంది.

పెళ్లైన నాటి నుంచే మద్యం సేవిస్తూ వేధింపులకు గురి చేసేవాడని ఈ తరుణంలో వేధింపులు తాళలేక కామారెడ్డిలోని తన తల్లి ఇంటికి వచ్చేసింది. కోర్టు, పెద్దల జోక్య మూడు నెలల క్రితం భర్త దగ్గరకు వెళ్లింది. అక్కడే బెంగుళూరులో అనుమానాస్పదంగా శరణ్య మృతి చెందింది. కాగా ఆమె భర్త రోహితే చంపాడంటూ శరణ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తన్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like