FbTelugu

ఒకే కుటుంబంలో 6గురు అనుమానాస్పద మృతి

విశాఖపట్నం: పెందుర్తి మండలం జత్తాడలో ఘోర జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అనుమానాస్పద మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది.
బుధవారం అర్ధరాత్రి ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆరుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మధురవాడ మిథిలాపురి కాలనీలోని ఆదిత్య టవర్స్‌ లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మిథిలాపురి కాలనీలోని అపార్ట్‌ మెంట్‌ ఐదో అంతస్తులో 8 నెలల నుంచి ఎన్ఆర్ఐ కుటుంబం నివసిస్తున్నది. ఈ ఘటనపై స్థానికులు ఫిర్యాదు చేయగానే పోలీసులు అపార్ట్ మెంట్ వద్దకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం మృతులు.. బంగారు నాయుడు, డాక్టర్ నిర్మల, దీపక్ (22), కశ్యప్ (19)గా పోలీసులు గుర్తించారు. ఆరుగురి మృతికి పాత కక్షలేమైనా ఉన్నాయా అని పోలీసులు బంధువులు, స్నేహితులతో ఆరా తీస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.