FbTelugu

పెద్దల సభ నుంచి 8 మంది సభ్యుల సస్పెన్షన్

ఢిల్లీ: వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా నిన్న గొడవ చేసిన ఎనిమిది మంది ప్రతిపక్ష సభ్యులపై రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు వేటు వేశారు.
ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే వారం రోజుల పాటు 8 మందిని సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

రాజ్యసభ వైస్ ఛైర్మన్ హరివంశ్ పట్ల ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని అన్నారు. సభ్యులు సంజయ్ సింగ్, డెరెక్ ఒ బ్రెన్, రాజు సాతవ్, కెకె రెగేష్, రిపున్ బొరా, డోలా సేన్, సయ్యద్ నాజిర్ హుస్సేన్, ఎలమరన్ కరీం పై వేటు పడింది. బిల్లుల ఆమోదం సమయంలో రచ్చ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎంపీలు ఛైర్మన్ కు ఫిర్యాదు చేశారు. బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుపై ఛైర్మన్ వెంకయ్య చర్యలు తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.